Home » Anantapur
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్ రూ. 2,34,567 విరాళం అందజేశారు.
నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై న పనిముట్లను పంపిణీ చేశారు.
స్థానిక మున్సిపాల్టీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పే ర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని స్వగ్రామంలో కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇనచార్జ్ లు, బూత ఇనఛార్జ్‌లకు సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మేము ఉండగా సెక్యూరిటీ గార్డు ఎందుకు దండగా..? అన్నట్లుగా నాలుగైదు వీధికుక్కలు కణేకల్లులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దనే ఉంటున్నాయి. దీంతో ఖా తాదారులు ఏటీఎంలోకి వెళ్లాలంటేనే భయపడుతు న్నారు. ఖాతాదారుల భద్రత కోసం సెక్యూరిటీ గా ర్డు ఉండాల్సిన చోట అవి మకాం వేస్తుండడంతో వి నియోగ దారులు భయంతో ఏటీఎంలోకి అ డుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.
రాప్తాడు, ధర్మవరం నియోజకవవర్గాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమ పేరుతో తిరుపతి దామినేడులో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ, విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటితో పాటు పలువురు మంత్రులతో ఆమె భేటీ ఆయ్యారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు జేసీ సిద్ధమయ్యారు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
రెండేళ్ల కూటమి పాలన ప్రగతికి కానుకగా చంద్రబాబు పార్కును ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని బళ్లారిరోడ్డులోని శాంతినగర్‌లో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునీకీకరించిన చంద్ర బాబునాయుడు పార్కును గురువారం సాయంత్రం ఆయన ప్రా రంభించారు.
పట్టణ సమీపంలోని గన్నె వారిపల్లి పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ ధ్వర్యంలో బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు రుణ మం జూరు పత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వానికి పేదలపట్ల ఎంతో అభిమానమని, దీంతో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని జక్కలచెరువు గ్రామంలో రూ. 20లక్షలతో డ్రైనేజీ కాలువను నిర్మించారు. ఎమ్మెల్యే గురువారం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు.