TDP: సిట్ నివేదిక ఇచ్చినా.. ఇంకా బుకాయిస్తారా?
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:40 PM
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్‌లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు.
వైసీపీ నేతలపై పరిటాల శ్రీరామ్ మండిపాటు
ధఽర్మవరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్‌లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు. నిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రోక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పరిటాలశ్రీరామ్ మాట్లాడు తూ..తొగటవీర క్షత్రియులు, చేనేతల ఆరాధ్య దైవమైన చౌడమ్మదేవి అశీస్సులు ధర్మవరం ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక చర్యల కు పాల్పడ్డారన్నారు. అందులో తిరుమల లడ్డు కల్తీ ప్రధానమైంద న్నారు. లడ్డూకల్తీ జరిగిందని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, డి ప్యూటీ సీఎం పవన కల్యాణ్ చెబితే వైసీపీ నాయకులు విమర్శలు చేశా రన్నారు. ఇప్పుడు సిట్ అఽధికారులు అత్యంత పకడ్బందీగా విచారణ చేపట్టి... సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చినా క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం పలు కుబడి లేని ఓ సామాన్య వ్యక్తి... డెయిరీలను బెదిరించి, కమిషన వసూ లు చేసి, నకిలీ నెయ్యి సరఫరా చేసి, దాన్ని ప్రసాదం వరకూ ఎలా పంపగలడని ప్రశ్నించారు. అసలు అవులే లేని చోట నెయ్యి ఎలా వ స్తుందని నిలదీశారు. వైసీపీ చేసిన పాపానికి తగిన శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పరిశే సుధాకర్, సంధా రాఘవ, గంగారవు రవి, ధనుంజయ, పల్లపు శివశంకర్, వంట రమేశ, చిన్నూరులోకేశ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....