TDP: కల్తీ నెయ్యి పాపం వైసీపీదే
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:06 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కల్తీమద్యం తాపించి ఎంతో మంది అమాయకుల మరణాలకు కారణమైన వైసీపీ నేతలు, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధి లో సైతం పాపం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, నాయకులు రాళ్లపల్లి షరీఫ్ అన్నారు.
- టీడీపీ నాయకుల ఆరోపణ - ఆలయం వద్ద నిరసన
ధఽర్మవరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కల్తీమద్యం తాపించి ఎంతో మంది అమాయకుల మరణాలకు కారణమైన వైసీపీ నేతలు, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధి లో సైతం పాపం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, నాయకులు రాళ్లపల్లి షరీఫ్ అన్నారు. కల్తీ నెయ్యి పాపం దుర్మార్గపు చర్యగా వర్ణిస్తూ స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఎదుట నిరసన చేపట్టారు. వారు మాట్లా డుతూ...తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి పాపానికి కారకులైన వైసీపీ నేతలను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చట్టా లక్ష్మీనారాయణ, కేశగాళ్ల శీన, గవ్వల నారాయణస్వామి, గంగారపు రవి, ముతుకూరు బీబీ, కత్తుల బాబ్జీ, గోసల శ్రీరాములు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....