Share News

COLLECTOR: రెవెన్యూ సేవలలో జాప్యం వద్దు : కలెక్టర్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:58 PM

ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్‌ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్‌ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు.

COLLECTOR: రెవెన్యూ సేవలలో జాప్యం వద్దు : కలెక్టర్‌
Collector Shyamprasad examining the groundnut crop

బత్తలపల్లి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్‌ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్‌ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిర్దేసించిన గడువులోగా పరిష్కరిం చాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చే అర్టీల విషయంలో జాప్యం చేయకూడదన్నారు. అంతకు మునుపు ఆయన మండలపరిధిలోని అప్రాచెరువు గ్రామంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటలను వ్యవసాయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రైతులతో మాట్లాడుతూ... రైతులు తమ ప్రాంతాలకు అనువైన పంటలను సాగు చేయలని సూచించారు. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇనచార్జ్‌ వ్యవసాయాధికారి క్రిష్ణయ్య, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్‌, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్‌ లక్ష్మనాయక్‌, ఏపీసీడ్స్‌ జిల్లా మేనేజర్‌ సుబ్బయ్య, వ్యవసాయశాఖ ఏడీ లక్ష్మానాయక్‌, ఏఓ ఓబిరెడ్డి, రైతులు వీరనారప్ప, రామక్రిష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2026 | 11:58 PM