DISPUTE: స్థల వివాదం... ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:13 AM
మండలంలోని సు బ్బరావుపేట సమీపం లో ఉన్న భూమి తమ దని ఓ వర్గం కోర్టును ఆశ్ర యించగా, ఎన్నో ఏళ్లుగా పొజిషనలో ఉ న్నామని మరో వర్గం వారు మొరపెట్టుకున్నారు. గ్రామ సమీపం లోని సర్వేనం. 74-2లో 4.88ఎకరాల భూమి భూమిలో కొన్నేళ్లుగా అదేగ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, వెంకటన రసమ్మ, పెద్దిరాజులు, తలారి గంగాధర్, క్రిష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గంగులప్ప మరికొంత మంది కళ్లాలు వేసుకుని పొజిషనలో ఉన్నారు.
ధర్మవరం రూరల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సు బ్బరావుపేట సమీపం లో ఉన్న భూమి తమ దని ఓ వర్గం కోర్టును ఆశ్ర యించగా, ఎన్నో ఏళ్లుగా పొజిషనలో ఉ న్నామని మరో వర్గం వారు మొరపెట్టుకున్నారు. గ్రామ సమీపం లోని సర్వేనం. 74-2లో 4.88ఎకరాల భూమి భూమిలో కొన్నేళ్లుగా అదేగ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, వెంకటన రసమ్మ, పెద్దిరాజులు, తలారి గంగాధర్, క్రిష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గంగులప్ప మరికొంత మంది కళ్లాలు వేసుకుని పొజిషనలో ఉన్నారు. అయితే ఈ భూమి తమదంటూ అదేగ్రామానికి చెందిన క్రిష్ణమ్మ, వెంకట రమణరెడ్డి కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఈ భూ వివాదం నడుస్తోంది. ఆ భూమిని సర్వేచేసేందుకు బుధ వారం రెవెన్యూ అధికారులు మండలసర్వేయర్ మంజుల, గ్రామ సర్వేయర్ వాణి, వీఆర్‌ఓ ప్రసాద్ గ్రామానికి వెళ్లారు. అయితే పొ జిషనలో ఉన్న వారు సర్వేను అడ్డుకున్నారు. దీంతో రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్ తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడా రు. పొజిషనలో ఉన్న వెంకటనరసమ్మ, వెంకటనారాయణరెడ్డి మరి కొంతమంది తమకు న్యాయం చేయకుంటే పురుగుల మందుతాగి చస్తామంటూ పురుగుమందు డబ్బాలను తెరిచి తాగేందుకు యత్నించడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. వెంటనే ఎస్ ఐ వారిచేతుల్లోని పురుగులమందు డబ్బాలను తీసేసుకున్నారు. చట్టపరంగా రెవెన్యూ అధికారులతో సమస్యను పరిష్కరిం చుకోవాలని సూచించారు. అనంతరం రెవెన్యూ అధికారులు పోలీ సుల సమక్షంలో భూమిని సర్వేచేశారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....