Home » Anantapur
దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.
తన డిపార్ట్మెంట్ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్ చేసిన ఓ వీఆర్ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది.
టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధర భారీగా పెరిగింది.
మండలపరిధిలోని మం డ్లిపల్లి మిట్ట వద్ద రైతు రామిరెడ్డి సాగుచేసిన మల్బరీ తోటలో మ ల్బరీ సాగుచేసే రైతులకు సెరికల్చర్ ఏడీ వెంకట స్వామినాయక్ గురువారం అవగాహన కల్పించారు. ఎకరం మల్బరీ సాగుకు సాధారణ రైతులకు ప్రభుత్వం రూ.22,500, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27వేల సాయం అందిస్తోందన్నారు. ఐదెకరాల వరకు ప్రభు త్వం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు
తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి, మహిళా కన్వీనర్ పద్మజ, మైనార్టీ కన్వీనర్ తబ్రేజ్ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిల్పారామంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర జాతీయ రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ గురువారం పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, బీసీ.జనారఽ్ధన రెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మండల పరిధిలోని కమ్మ వారిపల్లి నుంచి పాత బత్తలపల్లి మీదుగా కొండేపాళ్యం వరకు రోడ్డుకు ఇరువైపుల గడ్డి ఏపుగా పెరింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఏపుగా పె రిగిన గడ్డిని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క మ్మవారిపల్లి నుంచి పాత బత్తలపల్లి, చండ్రాయునిపల్లి, కొండేపాళ్యం మీదుగా కదిరికి వెళ్లే ఈ రహదారి 18 కిలోమీటర్లు ఉంది.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.