Share News

FIRE: అరటిచెట్లు అగ్నికి అహుతి

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:58 PM

మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగుచేసిన అరటిచెట్లు అగ్నికి అహుతయ్యాయి. తనకున్న మూడు ఎకరాల్లో సుమారు 3000 అరటిచెట్లు సాగుచేశానని బాధిత రైతు ఆదివారం తెలిపాడు.

FIRE: అరటిచెట్లు అగ్నికి అహుతి
Burning banana trees

ధర్మవరం రూరల్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగుచేసిన అరటిచెట్లు అగ్నికి అహుతయ్యాయి. తనకున్న మూడు ఎకరాల్లో సుమారు 3000 అరటిచెట్లు సాగుచేశానని బాధిత రైతు ఆదివారం తెలిపాడు. మొదటి పంట కోశామని, రెండో పంట మొ గ్గదశలో ఉందని తెలిపాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు పొలం సమీపంలో నిప్పు పెట్టడంతో అది పంట కు వ్యాపించిం దన్నారు. గ్రామస్థులంతా కలిసి అర్పేందుకు ప్రయత్నించామని, అప్పటికే సుమారు 1500చెట్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సుమారు రూ. 3లక్షల వరకు నష్టపోయామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కుటుంబం కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 01 , 2026 | 11:58 PM