Share News

LEAKAGE: చెరువు మరువ లీకేజీ

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:53 PM

మండలంలోని పోతు కుంట చెరువు లీకేజీ అయి నీరంతా వృథాగా వెళుతోంది. ఇటీవల హాంద్రీనీవా నీటితో చెరువు నిండి మరువ పారింది. అయితే ప్రస్తుతం మరువ నిలిచిపోయింది. అయితే చెరువు మరువ పారే కట్ట దెబ్బ తినడంతో రాళ్ల సందుల్లో నుంచి నీరు లీకేజీ అవుతోంది.

LEAKAGE: చెరువు మరువ లీకేజీ
Leaking water from pothukunta lake dam

వృథాగా పోతున్న నీరు

ధర్మవరం రూరల్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతు కుంట చెరువు లీకేజీ అయి నీరంతా వృథాగా వెళుతోంది. ఇటీవల హాంద్రీనీవా నీటితో చెరువు నిండి మరువ పారింది. అయితే ప్రస్తుతం మరువ నిలిచిపోయింది. అయితే చెరువు మరువ పారే కట్ట దెబ్బ తినడంతో రాళ్ల సందుల్లో నుంచి నీరు లీకేజీ అవుతోంది. దీంతో చెరువులోని నీరంతా వృథా గా పోతోందని గ్రామస్థులు వాపోతున్నారు. భవిష్యత్తులో మరువ పారే కట్ట దెబ్బతినకుం డా, నీరు వృథాకాకుండా తగు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. చెరువు కట్ట దెబ్బతిని నీరంతా వృథాగా వెళితే వ్యవసాయ బోరుబావులు ఇంకిపోయే ప్రమాదం ఉందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన అధికారులు స్పందించి నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 01 , 2026 | 11:53 PM