MLA: స్వర్ణాంధ్ర సాధనే సీఎం ధ్యేయం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:22 AM
స్వర్ణాంధ్రప్రదేశ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని పాము దుర్తి గ్రామంలో శనివారం స్వర్ణ గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు.
- ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
బుక్కపట్నం/కొత్తచెరువు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్రప్రదేశ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని పాము దుర్తి గ్రామంలో శనివారం స్వర్ణ గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైసీపీ పాలన తో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీకాలనీలో రూ.25లక్షల ఉపాధి నిధులతో సీసీరోడ్లును ప్రారంభించి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రూ. 24కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే రూ. 34కోట్లతో తారు రోడ్డుకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో గంగులప్ప, సర్పంచ గుర్రంపాటి జ్యోతి క్రిష్ణమూర్తి, రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ యశోదారాయుడు, టీడీపీ మండలకన్వీనర్ మల్లిరెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు అప్పస్వామి, నాయకులు చెన్నక్రిష్ణ, సామకోటి ఆదినా రాయణ, గంగాధర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు: మండల పరిధిలోని మైలసముద్రం గ్రామంలో శని వారం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....