Share News

AUCTION: దుకాణాల వేలంపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:57 PM

మండలకేంద్రంలో నిర్మించిన పంచాయతీ దుకాణ సముదాయంలోని గదులకు వేలంపాట నిర్వ హించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముదిగుబ్బ పంచా యతీ కార్యాలయం వద్ద ఐదు దుకాణ గదులను నిర్మించారు.

AUCTION: దుకాణాల వేలంపై నిర్లక్ష్యం
Panchayat shop rooms to be auctioned

- గడువు ముగిసి ఏడాది కావస్తున్నా పట్టించుకోని అధికారులు

- ఆదాయం కోల్పోతున్న పంచాయతీ

ముదిగుబ్బ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో నిర్మించిన పంచాయతీ దుకాణ సముదాయంలోని గదులకు వేలంపాట నిర్వ హించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముదిగుబ్బ పంచా యతీ కార్యాలయం వద్ద ఐదు దుకాణ గదులను నిర్మించారు. వాటిని పంచాయతీ అధికారులు ప్రతి రెండేళ్లకోసారి వేలంపాట నిర్వహించి అద్దెకు ఇస్తున్నారు. 2023లో వేలం నిర్వహించి ఒక్కో గదిని నెలకు రూ. 8వేలు చొప్పున అద్దెకు ఇచ్చారు. గత ఏడాది మార్చితోనే అప్పటి వేలం గడువు ముగిసింది. ఆ నెలలోనే వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే ఏడాది గడుస్తున్నా వేలంపాట నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఐదు దుకాణ గదులు ఖాళీగా ఉన్నాయి.


వాటి నుంచి అద్దెల రూపంలో నెలకు వచ్చే రూ. 40 వేల ఆదాయాన్ని పంచాయతీ కోల్పోతోంది. ఈ మేరకు ఇప్పటి వరకు రూ. లక్షల్లో పంచాయతీ నష్టపోతోంది. వేలంపాట నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎంతో వెసలుబాటు ఉండేది. ఇప్పటి వరకు అద్దె కు ఇవ్వకపోవడంతో గదులు నిరుపయోగంగా ఉన్నాయి. పంచాయతీ ఆదాయం కోల్పోతోంది. ఈ విషయాన్ని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు పలుమా ర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందించినా ఎవరూ పట్టిం చుకోవడంలేదని విమర్శిస్తు న్నారు. ఇప్ప టికైనా సంబంధిత అఽధికారు లు స్పందించి దుకాణం గదుల వేలం నిర్వహించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

పై అధికారులకు నివేదికలు పంపాం

- నారాయణస్వామి, పంచాయతీ కార్యదర్శి, ముదిగుబ్బ

పంచాయితీ గదులు వేలంపాట వేలం వెయ్యడానికి పై స్థాయి అధికారులకు నివేదికలు పంపాము. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే పంచాయితీ గదులను వేలం నిర్వహిస్తాము


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 02 , 2026 | 11:57 PM