Home » Anantapur
పట్టణంలోని సీహెచసీ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మనగా యేళ్ల తిమ్మప్ప బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. అంత కుమునుపు ఆసుపత్రిలో నూతన కమిటీ స భ్యులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్ హైస్కూల్‌లో ఎస్ ఎంసీ చైర్మన పార్వతి, వైస్ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకా శం వుంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంపై బుధవారం పట్టణంలో ని ఏడో వార్డులో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుబ కుల స్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి డిమాండ్లను నెర వేర్చాలని బీసీ కమిషన చైర్మన శ్రీరాజీవ్ రంజనమిశ్రాను కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున కోరారు.
స్థానిక రైల్వే స్టేషనలో 24 బోగీలను నిలిపే ఫిట్ లైన్లను ఏర్పాటుచేయడానికి కృషిచేయాలంటూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం రెండు రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎంపీతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు భేటీ అయ్యారు.
పట్టణంలోని తాడిపత్రి రోడ్డులోని జంగాల కాలనీ వాసులు మంగళవారం సాయంత్రం తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గత మూడు వారాలుగా తమ కాలనీకి తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని రాయలచెరువులో నీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు పం పించే ట్యాంకర్ల వద్ద నీటికోసం గుంపులు గుంపులుగా చేరుతున్నారు. రెండురోజులుగా రాయలచెరువులో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు తెలిపారు.
హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో స్వామి వారికి విశేష పూ జలు, అలంకరణ, హోమాలు చేపట్టారు. పలు ఆలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణం, సుందరకాండ పారాయణం చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదానం చేపట్టారు.
పట్టణంలోని అపోల్ సర్కిల్‌లో ఒరిగిన విద్యుత స్తం భం ప్రమాదకరంగా ఉంది. ఆ స్తం భం ఎప్పుడు కిందపడుతుందో, ఏ ప్ర మాదం జరుగుతుందోనని ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. అలాగే ఆ స్తం భం చుట్టూ గుంతలు పడ్డాయి.
ప్రజలే తన దేవుళ్లని, వారి మధ్యే తన పుట్టిన రోజును ఈనెల 25న వినూత్నరీతి లో జరుపుకుంటానని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆది వార స్థానిక నివాసంలో విలేకరుల సమా వేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత పుట్టినరోజులను సాధారణంగా దివ్యాంగు ల మధ్య జరుపుకొనే వాడినని తెలిపారు.