Home » Anantapur
మహిళల వినూత్న కా ర్యక్రమాలతో, వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన హాలులో మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా సమాఖ్య నాలుగో వార్షిక మహాజన సభ నిర్వహించారు.
మండలకేంద్రమైన తనకల్లు, అలాగే కొక్కంటి క్రాస్‌లో జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని ఎని మిదేళ్ల క్రితం చేపట్టారు. అప్పట్లో కొక్కంటి క్రాస్, తనకల్లులో డివైడర్లను నిర్మించి, వాటి మధ్యలో విద్యుత స్తంభాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆ స్తంభాలకు లైట్లను కూడా అమర్చారు.
ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...
జాతీయ స్థాయి జూనియర్ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్‌లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలు జరిగాయన్నారు.
సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.
పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరై చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని 22మందికి మంజూరైన రూ. 12,28,362 లక్షల చెక్కులను అందజేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలంటూ సీపీఐఎంఎల్, బహుజనసమాజ్ పార్టీ, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ఇనుప గోళాలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.
అనంతపురం జిల్లాలోని అరవింద్ నగర్ అయ్యప్ప కేఫ్ వద్ద నలుగురు స్నేహితుల మధ్య గొడవ చెరలేగింది. గంజాయి మత్తులో రాజు అనే యువకుడిపై అజయ్‌తో పాటు మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మండల పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరి శుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులను సైతం ఇందులో భాగస్వాములను చేసింది. అమలు చేయాల్సిన అధికారులే పట్టించుకోక పోవడంతో ఈ కార్యక్రమం నీరుగారి పోతోంది.