SP: ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:54 PM
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మండలపరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను ఎస్సీ సతీష్‌కు మార్ శనివారం పరిశీలించారు. మండలపరిధిలోని గూటిబైలు గ్రామం వద్ద వెలసిన తిమ్మమాంబ ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
నంబులపూలకుంట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి) : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మండలపరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను ఎస్సీ సతీష్‌కు మార్ శనివారం పరిశీలించారు. మండలపరిధిలోని గూటిబైలు గ్రామం వద్ద వెలసిన తిమ్మమాంబ ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీ సులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ యేడాది ఉత్సవాల్లో భక్తు లు అధికంగా పాల్గొనే అవకాశముందని, ముందస్తుగా చర్యలు తీసు కోవాలని సూచించారు. ఆయనతోపాటు డిఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నాగేంద్ర, ఎస్‌ఐలు క్రిష్ణమూర్తి, సుమలత, తహసీల్దార్ దేవేంద్ర నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కాటకోటేశ్వర క్షేత్రం సందర్శన
తాడిమర్రి: మండలంలోని కాటకోటేశ్వరక్షేత్రంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఉత్సవాలను ప్రజలందరూ కలిసికట్టుగా జరు పుకోవాలని ఎస్పీ సతీశకుమార్ సూచించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆయన శనివారం సాయంత్రం పరిశీలించారు. కాటకోటేశ్వర క్షేత్రం, చిల్లవారిపల్లి గ్రామాలలో పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేయడంతోపాటు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమరాల పనితీరును పరిశీలించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వ హించారు. రాత్రి సమయాల్లో డ్రోన కెమరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీహేమంతకుమార్‌ను ఆదేశించారు. చిల్లవా రిపల్లి గ్రామస్థులతో మాట్లాడుతూ... ఉత్సవాలలో అడ్డంకులు సృష్టిం చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో డీఎస్పీ హేమంతకుమార్, సీఐ సునీత, ఎస్‌ఐ క్రిష్ణవేణి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....