Home » Anantapur
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఎనఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పీవీకేకే కళాశాల సమావేశపు హాల్‌లో ఎనఎంయూఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
విద్యతోనే సమాజంలో గౌరవం, ఉన్నత స్థాయి దక్కుతాయని రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపూనాటి శంకరయ్య తెలిపారు. ఆదివారం శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణమండపంలో సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.
మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు.
క్రీడలు మానసికోల్లాసం ఇవ్వడంతోపాటు జీవితాన్ని మారుస్తాయని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని పాపంపేటకు చెందిన టీడీపీ యువ నాయకుడు హరీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు.
ఒక ట్రిప్పు చెత్త తరలించి మూడు నాలుగు ట్రి ప్పులు తోలినట్లు బిల్లులు చేసుకుని అధికా రులు యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కో ట్లాది రూపాయలు అవినీతి జరుగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
ప్రజలకు, కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే తక్షణమే స్పందించేది తెలుగుదేశంపార్టీ అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక అతిథిగృహంలో శనివారం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు.
మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు నిర్వహణపై గడేకల్లు గ్రామంలో క్టస్టర్-1 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విడపనకల్లు మండలంలో రెండు క్లస్టర్లు ఉన్నాయని, వాటి పరిధికి సంబంధించి గడేకల్లు, విడపనకల్లులో మహా నాడు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు.
పట్టణంలోని గంగా నగర్, హనుమేష్ నగర్‌లో శనివారం కలెక్టర్ ఒ. ఆనంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాద పూర్యకంగా కలిశారు.