• Home » Anantapur

Anantapur

ROAD: అధ్వానంగా రహదారి

ROAD: అధ్వానంగా రహదారి

పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్‌ హౌస్‌ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

GAMES: కొనసాగిన డివిజన స్థాయి క్రీడా పోటీలు

GAMES: కొనసాగిన డివిజన స్థాయి క్రీడా పోటీలు

ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్‌-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్‌గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్‌గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్‌ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్‌గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్‌ -14 రన్నర్‌గా తనకల్లు మండలం, అండర్‌-17 రన్నర్‌ గా కదిరి మండలం జట్టు నిలిచాయి.

FORMER MINISTER: కలసికట్టుగా అభివృద్ధి చేద్దాం

FORMER MINISTER: కలసికట్టుగా అభివృద్ధి చేద్దాం

స్థానిక మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి మార్కెట్‌యార్డ్‌ చైర్మన, డైరెక్టర్లకు సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో తొలిసారిగా నూతన కమిటీ సమావే శాన్ని చైర్మన పూలశివప్రసాద్‌ అఽఽధ్యక్షతన గురువారం నిర్వహించా రు. మాజీ మంత్రి పల్లె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు.

OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు

OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు

స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

COUNCIL: ఆ కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలి

COUNCIL: ఆ కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలి

పట్టణ సమీపంలోని పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీలోకి చేర్చాలం టూ కౌన్సిలర్లు మూకమ్మడిగా అధికారులను డిమాండ్‌చేశారు. సమావేశం ప్రారంభకానికి ముందే సమావేశపు హాల్‌లో ఉన్న కమిషనర్‌, అధికారుల ను చైర్‌పర్సన కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు చైర్‌పర్సన చాంబర్‌లోకి పిలిపించు కున్నారు. పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సి పాలిటీలోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరచలేదని ఇనచార్జ్‌ కమిషనర్‌ సాయికృష్ణను డిమాండ్‌చేశారు.

QUARTERS: పాముల బెడద

QUARTERS: పాముల బెడద

మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.

AC: పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

AC: పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్‌ కమిషనర్‌ లాజర్‌ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు.

CROPS: పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు

CROPS: పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు

మండలపరిదిలోని గంటాపురం గ్రామంలో సాగు చేసిన కంది, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్త మాధవిలత, ఏడీఏ లక్ష్మనాయక్‌ బుధవారం పరిశీలించారు. కందిలో మరుకా మచ్చల పురుగును గుర్తించారు. దీని నివారణకు వేప నూనె 1000మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ 500మి.లీ. కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు.

GAMES: ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి పోటీలు ప్రారంభం

GAMES: ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి పోటీలు ప్రారంభం

పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కదిరి డివిజన స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలను డీఈఓ కిష్టప్ప బుధవారం ప్రారంభించారు. బాల బాలికలు అండర్‌ -14, 17 విభాగాలలో చెస్‌, యోగా, షటీల్‌ క్రీడలలో పాల్గొన్నారు.

MLA: అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : ఎమ్మెల్యే

MLA: అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : ఎమ్మెల్యే

మునిసిపాలిటీలో ఏ స్థాయి ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యే బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని చైర్‌పర్సన చాంబర్‌లో చైర్‌పర్సన దిల్షాద్‌ ఉన్నీసా, వైస్‌ చైర్మెన రాజశేఖర్‌ ఆచారితో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉపేక్షించమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి