MAGISTRATE: మత్తులో పడి చిత్తు కాకండి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:31 PM
యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై చిత్తు కావద్దని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. మా దకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా... పట్టణంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయాధికారి పాల్గొని మాట్లాడారు.
మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన జయలక్ష్మి
కదిరిలీగల్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై చిత్తు కావద్దని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. మా దకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా... పట్టణంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయాధికారి పాల్గొని మాట్లాడారు. మత్తుకు బానిసలై యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత నిర్వీర్యం దేశ భవితకు వినాశకరం అన్నారు. మత్తు పదార్థాల వైపు కాక ఉజ్వల భవిష్యత్తు వైపు మీ పయనాన్ని సాగించమని సూచించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రమాణం చే యించారు. ఈ సదస్సులో ఏరియా ఆసుపత్రి డాక్టర్ ఎస్‌కే బాబా ఫకృ ద్దీన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నగష్, విజయ్‌కుమార్, న్యాయవాది లోకేశ్వర్ రెడ్డి, హాస్టల్ ఆఫీసర్ ఓబుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....