Share News

GOD: ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:40 PM

త్యాగరాజు స్వామి ఆరాధనోత్సవాన్ని బుధవారం పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం, మంగళ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజుస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

GOD: ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
A scene of worshiping at the image of Lord Thyagaraja

కదిరి అర్బన, జనవరి 7(ఆంధ్రజ్యోతి): త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని బుధవారం పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం, మంగళ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజుస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తూ, త్యాగరాజస్వామికి గాత్రనీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ, మంగళ వాయిద్యాల కళాకారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 07 , 2026 | 11:40 PM