Share News

MLA: మన భూమి - మన హక్కు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:34 PM

మన భూమిపై మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుసుమవారిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 68 మంది రైతులకు రాజ ముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

MLA: మన భూమి - మన హక్కు
MLA distributing pass books in Obuladevaracheruvu

భద్రత కోసమే రాజముద్రతో పాసుపుస్తకాలు

ఎమ్మెల్యే సింధూరరెడ్డి

ఓబుళదేవరచెరువు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మన భూమిపై మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుసుమవారిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 68 మంది రైతులకు రాజ ముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుల భూముల భద్రత కోసం ప్రభుత్వం రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తోం దని తెలిపారు.జగన ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని అన్నారు.


ఒక వేళ పొరబాటున జగన మళ్లీ అధికారం లోకి వచ్చి ఉండుంటే మన ఆస్తు లన్నీ తాకట్టులో ఉండేవని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ని యోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి, కొత్తచెరువు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన పూల శివప్రసాద్‌, కూటమి టీడీపీ మంట కన్వీనర్‌ శెట్టివారిజయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, నాయకులు తుమ్మల మహబూబ్‌బాషా, బోయపల్లి శివారెడ్డి, బొడ్డు జయన్న, కంచి సురేష్‌, బుద్దల ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

అమడగూరు: మండల పరిఽధిలోని రామ్‌నాథ్‌పురంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేతుల మీదగా రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల సహకారంతో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పుట్టపర్తిని తీర్చిదిద్దు తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్‌ రామ్‌నాథ్‌రెడ్డి, ఎంపీడీఓ మునెప్ప, టీడీపీ మండల కన్వీనర్లు గోపాల్‌ రెడ్డి, జయచంద్ర, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్యామ్‌ బాబునాయుడు, కుమార్‌రెడ్డి, కాలేనాయక్‌, చింతా శరతకుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌నాయక్‌, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 06 , 2026 | 11:35 PM