• Home » Anantapur

Anantapur

FARMER: పాడిరైతులకు తప్పని కష్టాలు

FARMER: పాడిరైతులకు తప్పని కష్టాలు

కరువు ప్రాంతమైన అమడగూరు మండలంలో వ్యవసాయంతో రైతులు ప్రతి యేటా నష్టాలు చవి చూస్తున్నారు. దీంతో పె ట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేక, పంటలు సాగిచేసినా పెట్టుబడులు తిరిరాని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. దీంతో చాలామంది రైతులు రైతులు పాడిపరిశ్రమపై మక్కువ చూపుతున్నారు. ఎవరి శక్తి వారు రెండు లేదా నాలుగు ఆవులు, గేదెలు పెట్టుకొని పాలవ్యాపారం చేస్తున్నారు.

THEFT: రైతులే టార్గెట్‌గా చోరీలు

THEFT: రైతులే టార్గెట్‌గా చోరీలు

కొద్దికాలం క్రితం వరకు ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో ఇప్పుడు రైతుల పొలాలను టార్గెట్‌గా చేసు కున్నారు. వేలకు వేలు ఖర్చుచేసుకుని పంటలకు విద్యుతకనెక్షన కోసం రైతులు అమర్చుకున్న ట్రాన్స ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్‌ ను, కాపర్‌ వైర్‌ను ఎత్తుకెళ్తుండడంతో విద్యుతసరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

CROP: కందిపై తుఫానల ప్రభావం

CROP: కందిపై తుఫానల ప్రభావం

మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగుచేసిన కంది పంటకు తెగుళ్లు సోకాయి. మండలవ్యా ప్తంగా సుమారు ఏడు వేల హెక్టార్లకు పైగా కంది సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. అయితే ఇటీవల తుఫాన్ల ప్రభావంతో కంది పూత, పిందెపై ప్రభావం చూపుతోంది. పూత రాలిపోవడం, పిందెలను పచ్చపురుగు ఆశించడంతో పంటంతా దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

GOD: నారసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

GOD: నారసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

పట్టణంలోని ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు శనివారం కావడంతో జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. అలాగే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వి ద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

CROPS: యూరియా కొరత

CROPS: యూరియా కొరత

అసలే అరకొరగా వస్తున్న నీరు... ఆ పై ఎరువుల కొరత... రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోం ది. ఖరీఫ్‌ సీజనలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు యూరి యా వాడకం అధికంగా ఉంటుంది. నెలకు ఒకమారు చొప్పున తక్కువ మోతాదులో యూరియాను పంటలకు వేస్తుంటారు. కానీ మండల రైతులకు ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు.

EMPLOYEES: అందుబాటులో లేని విద్యుత సిబ్బంది

EMPLOYEES: అందుబాటులో లేని విద్యుత సిబ్బంది

విద్యుతశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఆ శాఖ సిబ్బంది, అధికారులు ఉన్నా రా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఎక్కడైనా ట్రాన్సఫార్మర్లలో ఫ్యూజ్‌ పోతే కూడా వేసే నాథుడే లేడని వినియోగదారులు, రైతులు మండిపడుతున్నారు.

Tragedy in Anantapur: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..

Tragedy in Anantapur: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..

అనంపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య గొడవ ఏడాదిన్నర చిన్నారిని ఒంటరిని చేసింది.

EMPLOYEES: పెండింగ్‌ జీతాలను చెల్లించండి

EMPLOYEES: పెండింగ్‌ జీతాలను చెల్లించండి

నాలుగునెలలుగా పెండింగ్‌లో ఉన్న జీత భత్యాలను వెంటనే చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్‌కు విన్నవించారు. వారు గురువారం జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాల య ప్రాంగణంలో పీడిని కలసి వినతి పత్రం అందచేసిన అనంతరం ఉపాధి హామీ పథకం సిబ్బంది జేఏసీ అధ్యక్షుడు మనోహర్‌ మాట్లాడుతూ... నాలుగునెలలుగా పెండిం గ్‌లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని కోరారు.

EYE CAMP: కంటిపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌

EYE CAMP: కంటిపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌

గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగా హన కల్పించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ వైద్య సిబ్బందికి సూ చించారు. మండల కేంద్రంలోని సీహెచసీలో ఉచిత కంటి స్ర్కీనింగ్‌ శిబిరాన్ని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ... గ్రామీణుల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ వైద్యశిబిరాలను నిర్వహిస్తోందన్నారు.

TURN : ప్రమాదకరంగా మలుపు

TURN : ప్రమాదకరంగా మలుపు

మండలంలోని ముచ్చు రామి గ్రామం నుంచి రేగాటిపల్లికి వెళ్లే రహదారిలో ఓ మలుపు ప్రమాద కరంగా మారింది. ఆ మలుపు వద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలపాలయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి