Share News

MINISTER: మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:11 PM

మన సంస్కృతి, సంప్రదాయాల ను భావి తరాలకు అందించాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానం లో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన సతీసమే తంగా పాల్గొన్నారు.

MINISTER: మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం
Minister Sathya Kumar and leaders of the alliance lighting the bonfire

- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌

- ధర్మవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

- వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ, పరిటాలశ్రీరామ్‌, చిలకం

ధర్మవరం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మన సంస్కృతి, సంప్రదాయాల ను భావి తరాలకు అందించాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానం లో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన సతీసమే తంగా పాల్గొన్నారు. ముందుగా ఆయన తన సతీమణితో కలిసి కాలేజ్‌ సర్కిల్‌ నుంచి ఎద్దులబండిపై వచ్చారు. అనంతరం భోగిమంటలు వెలి గించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎస్పీ దంపతులు, టీడీపీ నియోజ కవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హరిదాసు, గంగిరెద్దు ప్రదర్శనలు, గ్రామీణ కుటీరాలు, పాలపొంగులు, నవధాన్యాల ప్రదర్శన, కీలు గుర్రాలు, గొరవయ్యలు, ఉరుములు వంటి కళారూపాలను వారు ఆసక్తిగా తిలకించారు.


కీలుగుర్రాలు, గొరవయ్య లు, ఉరుముల కళాకారులతో కలిసి మంత్రి స్వయంగా నృత్యాలు చేయడం ఆకర్షణగా నిలిచింది. అనంతరం మంత్రి సత్యకుమార్‌ మాటా ్లడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు తరతరలాలకు అందాలంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా జరగాలన్నారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ సంక్రాంతి అంటే రైతుల పండుగ అని, ఇక్కడ రైతులకు ఉపయోగపడే విధంగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ స్టాల్స్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిలకం మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య, దూదేకుల సంఘం రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ రాళ్లపల్లి షరీఫ్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు చింతలపల్లి మహేశ, ఫణికుమార్‌, పరిశేసుధాకర్‌, సంధారాఘవ, భీమనేని ప్రసాద్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 14 , 2026 | 11:11 PM