• Home » Anantapur

Anantapur

SEWAGE: రోడ్డుపైనే మురుగునీరు

SEWAGE: రోడ్డుపైనే మురుగునీరు

మండలకేంద్రం లోని పెడబల్లి రోడ్డులో మసీదు సమీపంలో మురుగునీరు రోడ్డుపై నిలు వ ఉంది.. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ఈ నీరు పాదాచా రులపై ఎగిరిపడుతోంది. దీంతో మసీదులో ప్రార్థనలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ముస్లింలు తెలిపారు.

MLA: పేదల వైద్యానికి పెద్ద పీట

MLA: పేదల వైద్యానికి పెద్ద పీట

పేదల వైద్యానికి కూటమి ప్రభు త్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో గురువారం రూ.46లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

LEAKAGE: మరమ్మతులు మరిచారా?

LEAKAGE: మరమ్మతులు మరిచారా?

పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ ఎదురుగా వడ్డే ఓబన్న విగ్రహం పక్కన పైపులైన లీకేజీ ఏర్పడింది. అది రోడ్డు మధ్యలో ఉంది. గత 20 రోజులుగా ఆ లీకేజీని తప్పించడానికి మూడు డివైడర్లను అడ్డం పెట్టారు. లీకేజీ ఏర్పడి 20 రోజులైనా మున్సి పాలిటీవారు మరమ్మతులు చేయడం పట్టించుకోలేదు.

AP News: బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూత

AP News: బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూత

బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్‏కుమార్‌ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్‏పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

Tadipatri Tension:పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్

Tadipatri Tension:పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్

తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు.

EMPLOYEES: పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

EMPLOYEES: పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

తమకు రావాల్సిన ఇంక్రిమెం ట్లు, అరియర్స్‌, మెడికల్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని మున్సిపాలిటీ పరి ధిలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులకు డిమాండ్‌ చేశారు. ఐదు నెలల ఇంక్రిమెంట్లతో పాటు అరియర్స్‌, మెడికల్‌ బిల్లుల మంజూరులో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారంటూ మంగళవారం ముస్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

MINiSTER: శత జయంతి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

MINiSTER: శత జయంతి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

సత్యసాయి బాబా శతజయం తి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం రాత్రిఆమె ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు కార్యాలయంలో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌తో సమా వేశమై ఏర్పాట్లపై చర్చించారు.

MINISTERS:  డ్వాక్రా బజార్‌ పోస్టర్ల ఆవిష్కరణ

MINISTERS: డ్వాక్రా బజార్‌ పోస్టర్ల ఆవిష్కరణ

సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యలో అఖిల భారత డ్వాక్రా బజార్‌ -2025 ప్రచార వాల్‌ పో స్టర్లను మంగళవారం స్థానిక శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రుల బృందం ఆవిష్కరించింది.

MLA: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

MLA: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఇస్తామని, పదవితో గౌరవిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పీఆర్‌ గ్రాండ్‌లో మంగళవారం నూతనంగా ఎన్నికైన క్లస్టర్‌, యూనిట్‌, బూత కన్వీనర్లతో ప్రమాణస్వీకా రం చేయించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళు లు అర్పించి, కేక్‌ కట్‌ చేశారు.

KIOSK: దిష్టిబొమ్మల్లా కియోస్క్‌ యంత్రాలు

KIOSK: దిష్టిబొమ్మల్లా కియోస్క్‌ యంత్రాలు

పంటల సాగులో రైతుల సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం అప్పటి రైతు భరోసా కేం ద్రాలలో(రైతు సేవా కేంద్రాలు) కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. తద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, మందుల నిలువ తెలుసుకోవడంతో పాటు సాగుకు అవసరమైన అంశాలను అందులో పొందుపరిచేందుకు అవకాశం కల్పించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి