Share News

GOD: భక్తిశ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినం

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:56 PM

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవీ మాత ఆత్మార్పణ దినాన్ని పట్టణంలోని కన్యకాపరమేశ్వర ఆల యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వ హించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వాసవీ మాతకు వెయ్యిలీటర్లకుపైగా పాలతో అభిషేకం చేశారు.

GOD: భక్తిశ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినం
MLA Kandikunta presenting silk clothes to Amma on behalf of the government

కదిరి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవీ మాత ఆత్మార్పణ దినాన్ని పట్టణంలోని కన్యకాపరమేశ్వర ఆల యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వ హించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వాసవీ మాతకు వెయ్యిలీటర్లకుపైగా పాలతో అభిషేకం చేశారు. అనంతరం 102 కలశాలతో తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. 21మంది క న్యకలు పూజలు చేశారు. ఆలయంలో జరిగిన పూజల్లో రాష్ట్ర ప్రభు త్వం తరపున ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అమ్మవారికి పట్టు వస్ర్తా లు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారఽథి, ఆర్య వైశ్య సంఘం, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 20 , 2026 | 11:56 PM