• Home » Anantapur urban

Anantapur urban

ISCON: నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

ISCON: నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్‌ మందిరంలో శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభమవనున్నాయి.

MLA DAGGUPATI: నక్ష రీసర్వేపై దృష్టి సారించాలి

MLA DAGGUPATI: నక్ష రీసర్వేపై దృష్టి సారించాలి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఆస్తులను డిజిటలైజేషనలో భాగంగా అనంత నగరపాలక సంస్థ పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైందని, ఆస్తుల రీసర్వేపై ప్రత్యేకదృష్టి సారించి సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ సూచించారు.

అన్నదాత సుఖీభవతో ఆనందం

అన్నదాత సుఖీభవతో ఆనందం

అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల కళల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరిలో రైతులతో కలిసి గురువారం ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో చిరు జల్లులు కురిసినా ఉత్సాహంగా వేలాది మంది రైతులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

PROJECTS: ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

PROJECTS: ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ZP MEETING: రైతుల ప్రాణాలు పోయినా పట్టదా..?

ZP MEETING: రైతుల ప్రాణాలు పోయినా పట్టదా..?

రైతుల ప్రాణాలు పోయినా.. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులకు పట్టడం లేదని జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత కార్యాలయంలోని సమావేశ భవనంలో జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

RAINS: పంటలకు వాన దెబ్బ

RAINS: పంటలకు వాన దెబ్బ

డతెరిపి లేని వానలు ఉమ్మడి జిల్లాలో పంటలను దెబ్బతీస్తున్నాయి. బోరుబావుల కింద చేతికొచ్చిన వేరుశనగ పంటను పలు ప్రాంతాల్లో రైతులు తొలగించారు. ఆ వెంటనే వర్షాలు ప్రారంభం కావడంతో కట్టె తడిసిపోయి నల్లగా మారి, పశుగ్రాసానికి పనికిరాకుండా పోతోంది. కాయలకు మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

sports రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో జిల్లాకు పతకాలు

sports రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో జిల్లాకు పతకాలు

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో జి ల్లాకు పతకాలు దక్కా యి. గుంటూరు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో ఆదివారం 6వ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌-2025 పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 200మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.

sprorts జిల్లా మహిళల క్రికెట్‌ జట్టు ఎంపిక

sprorts జిల్లా మహిళల క్రికెట్‌ జట్టు ఎంపిక

జిల్లా సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం సెలెక్షన్స నిర్వహించారు.

 divotion రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం

divotion రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం

జగద్గురు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు సద్గురు రవీంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని విన్సెంట్‌ ఫెర్రర్‌ కాలనీలో జేఎనటీయూ రోడ్డులో ఉన్న రవీంద్ర స్వామీజీ నివాసంలో వీటిని ప్రారంభించారు. ఇందులో ప్రథమ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాఘవేంద్రస్వామి, వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామితో పాటు అమ్మవారి విగ్రహాలకు, సాలగ్రామాలకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు.

BC : బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలి

BC : బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. బీపీ మండల్‌ కమిషన డే సందర్భంగా గురువారం స్థానిక ఏపీ స్టూడెంట్‌ జేఏసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల రూపకర్త బీపీ మండల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి