BC : బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:15 AM
ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీపీ మండల్ కమిషన డే సందర్భంగా గురువారం స్థానిక ఏపీ స్టూడెంట్ జేఏసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల రూపకర్త బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీపీ మండల్ కమిషన డే సందర్భంగా గురువారం స్థానిక ఏపీ స్టూడెంట్ జేఏసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల రూపకర్త బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు మండల్ అని, 7న మండల్ కమిషన నివేదిక సమర్పించిన రోజు అని గుర్తుచేశారు. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశ్వత్థ, ఎస్‌వీఎ్‌ఫఎస్ అధ్యక్షుడు చక్రధర్, అమర్‌యాదవ్, రామలింగ, పార్థు, శివ, నరేష్, రాము పాల్గొన్నారు.