అన్నదాత సుఖీభవతో ఆనందం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:13 AM
అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల కళల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరిలో రైతులతో కలిసి గురువారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో చిరు జల్లులు కురిసినా ఉత్సాహంగా వేలాది మంది రైతులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
రామగిరి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల కళల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరిలో రైతులతో కలిసి గురువారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో చిరు జల్లులు కురిసినా ఉత్సాహంగా వేలాది మంది రైతులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో 52 వేల మంది రైతులకు రూ.36 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద జమైందని అన్నారు. జగన రెడ్డి రూ.15వేలు ఇస్తామని చెప్పి, కొందరికే ఇచ్చారని విమర్శించారు. సీఎం చంద్రబాబు పార్టీలకు అతీతంగా ఈ పథకాన్ని అమలు చేశారని అన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా రూ.13వేల ప్రకారం ఇచ్చారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించామని, అన్నదాత సుఖీభవ అందలేని 10 మంది లోపే వచ్చారని అన్నారు. అది కూడా ఉద్యోగాలు, వాహనాలు ఉన్నందుకే సాయం అందలేదని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుకను అందజేస్తున్నారని అన్నారు.
రోగులకు వైద్యసేవలు అందించకపోతే చర్యలు
రామగిరి: రోగులకు సరైన వైద్యం అందించకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే పరిటాలసునీత హెచ్చరించారు. గురువారం రామగిరి పంచాయతీరాజ్ గెస్ట్‌హౌ్‌సలో వైద్యులతో సమావేశం నిర్వహించారు. చెన్నేకొత్తపల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడున్న అస్తవ్యస్త పరిస్థితుల గురించి వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల నిధుల ఆస్పత్రి నిర్మించామని అన్ని సౌకర్యాలు, సిబ్బందిని కేటాయించామన్నారు. కానీ ఇక్కడ రోగులకు సరైన వైద్యసేవలు అందించక చిన్నవాటికి కూడా అనంతపురం, ధర్మవరం ఆస్పత్రులకు రెఫర్ చేస్తూ రోగులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఆస్పత్రిలో విద్యుత లోఓల్టేజ్ సమస్య గురించి ఎమ్మెల్యేదృష్టికి తీసుకురాగా సరైన టెక్నీషియనకు చూపిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలక్ష్మి ఆహ్వానించారు.
20లోగా రోడ్డు పనులు ప్రారంభించాలి..
ఆత్మకూరు: అనంతపురం-తగరకుంట రోడ్డు పనులను 20వ తేలోఓగా ప్రారంభించాలని, లేదంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె బీ యాలేరు మార్గంలో తోపుదుర్తి, తగరకుంట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అప్పటి తోపు ప్రకా్‌షరెడ్డి ఆయన సోదరులు కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం వారిని బెదిరించి పనులు ఆపేయించి పారిపోయారని విమర్శించారు.