divotion రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:53 AM
జగద్గురు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు సద్గురు రవీంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో జేఎనటీయూ రోడ్డులో ఉన్న రవీంద్ర స్వామీజీ నివాసంలో వీటిని ప్రారంభించారు. ఇందులో ప్రథమ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాఘవేంద్రస్వామి, వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామితో పాటు అమ్మవారి విగ్రహాలకు, సాలగ్రామాలకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు.
అనంతపురం క్రైం/ టౌన, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి) : జగద్గురు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు సద్గురు రవీంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో జేఎనటీయూ రోడ్డులో ఉన్న రవీంద్ర స్వామీజీ నివాసంలో వీటిని ప్రారంభించారు. ఇందులో ప్రథమ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాఘవేంద్రస్వామి, వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామితో పాటు అమ్మవారి విగ్రహాలకు, సాలగ్రామాలకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు.
అలాగే శ్రీసూక్త, దుర్తాసూక్త, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం రవీంద్ర స్వామి భక్తులకు గంధం, మహిమాన్విత కుంకుమ, పండ్లు అందించారు. తర్వాత కరుట్లపల్లి, కూడేరు, అనంతపురం, ఆత్మకూరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అలాగే మొదటిరోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో స్వామివారి పూర్వారాధనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి బృందావనానికి నిర్మల్య విసర్జన, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజాది కైంకర్యాలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో అవధాని వాసుదేవశాసి్త్ర ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..