MLA DAGGUPATI: నక్ష రీసర్వేపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:16 AM
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఆస్తులను డిజిటలైజేషనలో భాగంగా అనంత నగరపాలక సంస్థ పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైందని, ఆస్తుల రీసర్వేపై ప్రత్యేకదృష్టి సారించి సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఆస్తులను డిజిటలైజేషనలో భాగంగా అనంత నగరపాలక సంస్థ పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైందని, ఆస్తుల రీసర్వేపై ప్రత్యేకదృష్టి సారించి సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. గురువారం స్థానిక అనంత నగరపాలక సంస్థ కాన్ఫరెన్స హాల్‌లో నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్‌డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన హ్యాబిటేషన్స (నక్షా) కార్యక్రమంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తులను లెక్కించి, డిజిటలైజేషన చేసి, ప్రతి ఆస్తి నుంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని సక్రమంగా వచ్చేందుకే నక్ష రీసర్వే చేపట్టారన్నారు. డ్రోన కెమెరాతో జియో ట్యాగ్ చేసి, ఆర్థోరెక్టిఫైడ్ ఇమేజ్ (ఓఆర్‌ఐ) ఆధారంగా ఇంటింటా సర్వే చేయాలని సూచించారు. నక్ష బృందాలు సకాలంలో సర్వే పూర్తి చేసి, 45రోజుల్లో ఓఆర్‌ఐ ఆధారంగా 50రోవర్లను ఏర్పాటు చేశారన్నారు. అనంత నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి నక్ష కార్యక్రమంపై సచివాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. టీపీఓ శిరీష, టీపీఎస్ మంజుల, సచివాలయ ఉద్యోగులు వీఆర్‌ఓలు, అడ్మినలు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.