Home » Anantapur urban
డా క్టర్లు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. వేళకు విధులకు రాకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులేమో కలెక్టరేట్‌లో గ్రీవెన్స అని వెళ్లిపోయారు. ఇదే అదనుగా డాక్టర్లు, సి బ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
గురువులు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని మాల్యం గ్రామంలో వెలసిన కల్లేశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మండలంలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాకులు సిలిండర్ ధర మీద అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గృహ వినియోగం కోసం సరఫరా చేసే సిలిండర్లను కమర్షియల్ కోసం వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లేనిదే ఇంట్లో ఎలాం టి పనులు జరగవు.
జిల్లా పరిషత కార్యాలయంలో 9 మందికి కార్యాలయ సబార్డ్‌నేటర్స్‌గా మంగళవారం కారుణ్యనియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సీఈఓ శివశంకర్ ఆధ్వర్యంలో చేపట్టారు.
ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు భగతసింగ్ ప్రైవేట్ అంబులెన్స స్టాండ్‌లోని డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముర్తుజా అన్నారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంతో పేదలకు మరింత విద్యుత ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక అనంత నగరపాలక సంస్థ న్యూ కాన్ఫరెన్సహాల్‌లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యుత మీటర్ రీడర్ల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎ్‌సఐలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై ప్రసంగించారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కోటకమ్మవారిపల్లి పంచాయతీ కార్యదర్శి ఫారూఖ్‌పై దాడి అమానుష చర్య అని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన(ఆల్‌మేవా) నాయకులు ఖండించారు.
విద్యుతరంగంలో ప్రభుత్వాల నిర్ణయాలకు విరుద్ధంగా ఉమ్మడిరాష్ట్రంలో చేపట్టిన ఉద్యమంలో అమరులైన వీరుల స్ఫూర్తితో మరో ఉద్యమం చేపట్టడానికి సిద్దమవుతున్నట్లు వామపక్షనేతలు అన్నారు.