AITUC: విద్యుత మీటర్ రీడర్లకు వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:10 AM
విద్యుత మీటర్ రీడర్ల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎ్‌సఐలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై ప్రసంగించారు.
అనంతపురం టౌన, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): విద్యుత మీటర్ రీడర్ల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎ్‌సఐలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై ప్రసంగించారు. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ పోరాటం చేస్తుంటే కాంట్రాక్టర్లు మాత్రం మీటర్ రీడర్లకు రెండు నెలల వేతనాలు బకాయి పెట్టడం సమంజసం కాదన్నారు. విద్యుత మీటర్ రీడర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమ్నా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజే్‌షగౌడ్, మీటర్ రీడర్ల అసోసియేషన రాష్ట్ర కోశాధికారి రమేష్, కిరణ్‌కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.