ZP CHAIRPERSON: జడ్పీలో కారుణ్య నియామకాలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:19 AM
జిల్లా పరిషత కార్యాలయంలో 9 మందికి కార్యాలయ సబార్డ్‌నేటర్స్‌గా మంగళవారం కారుణ్యనియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సీఈఓ శివశంకర్ ఆధ్వర్యంలో చేపట్టారు.
అనంతపురం న్యూటౌన, సెప్టెంబర్ 2(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత కార్యాలయంలో 9 మందికి కార్యాలయ సబార్డ్‌నేటర్స్‌గా మంగళవారం కారుణ్యనియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సీఈఓ శివశంకర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ముఖ్య అతిథిగా చైర్‌పర్సన గిరిజమ్మ హాజరై నియామకపత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ నూతనంగా నియామకాలు పొందిన వారు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ప్రజలకు మంచి సేవలందించేలా చూడాలన్నారు. డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మమత, మడకశిర పీఆర్‌ఐ సబ్‌డివిజనకు నియమించారు. శోభా, మడకశిర మండల పరిషత కార్యాలయం, రాఘవేంద్రరావు శెట్టూరు, శకుంతల సీకేపల్లి, భార్గవి చుక్కలూరు, ప్రసన్నకుమార్, దీపక్‌లకు జడ్పీ కార్యాలయం కేటాయించారు. బండ నవాజ్‌కు పీఐయూ కార్యాలయంలో నియమించారు. దనలక్ష్మికి బుక్కరాయసముద్రం ఎంపీడీఓ కార్యాలయం కేటాయించారు.