ONLINE VIGIT: ఖాళీ కుర్చీలే డాక్టర్లు !
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:03 AM
డా క్టర్లు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. వేళకు విధులకు రాకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులేమో కలెక్టరేట్‌లో గ్రీవెన్స అని వెళ్లిపోయారు. ఇదే అదనుగా డాక్టర్లు, సి బ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
పెద్దాస్పత్రి, సూపర్ స్పెషాలిటీలో రోగుల అవస్థలు
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): డా క్టర్లు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. వేళకు విధులకు రాకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులేమో కలెక్టరేట్‌లో గ్రీవెన్స అని వెళ్లిపోయారు. ఇదే అదనుగా డాక్టర్లు, సి బ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యం లో వైద్యం కోసం ప్రభుత్వ సర్వజన వైద్యశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవీ సోమవారం ‘ఆంధ్రజ్యోతి విజిట్’లో కనిపించిన కొన్ని దృశ్యాలు. అనారోగ్యంతో నగరంలోని ఈ రెండు ఆస్పత్రులకు వస్తే డాక్టర్లు, సిబ్బందితోపాటు వీల్‌చైర్లు, స్ర్టెచర్లు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓపిక ఉండాల్సిందే..
ప్రభుత్వ సర్వజన వైద్యశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఓపిక ఉండాల్సిందే. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి ఉదయమే ఆస్పతికి చేరుకుని, డాక్టర్ల కోసం నిరీక్షిస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ విభాగంలో రెండు మూడు గదుల్లో డాక్టర్ల టేబుళ్లు, కుర్చీలు ఖాళీ గా కనిపించాయి. మరికొన్ని ఓపీల్లో జూనియర్ డాక్టర్లు చూస్తున్నారు. సీనియర్ డాక్టర్లతో సమస్యలను చెప్పుకుందామంటే వారెప్పుడు వస్తారో, పోతారో తెలియని పరిస్థితులు ఉన్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో వీల్‌చైర్, స్రెచర్‌ల కొరత ఉండటంతో ఒక్కోదానిపై ఇద్దరు, ముగ్గురు రోగులను తరలిస్తున్నారు. కొందరిని కుటుంబసభ్యులే భుజాలపై ఆయా విభాగాలకు చేరుస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటాం
- డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్
రోగులు ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సోమవారం ఓపీ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మూడువేల మందికిపై గా రోగులు వస్తున్నారు. వీరికి సరిపడా స్ర్టెచర్స్, వీల్‌చైర్స్‌ను అం దుబాటులో ఉంచుతాం. డ్యూటీల్లోలేని డాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. సిబ్బంది, సెక్యూరిటీని సమకూర్చుతాం. సోమవారం కా వడంతో అడ్మినిస్ర్టేటర్‌తోపాటు నేనూ గ్రీవెన్సకు వెళ్లాల్సి వస్తోంది.