CITU : అంబులెన్స డ్రైవర్లకు అండగా ఉంటాం
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:15 AM
ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు భగతసింగ్ ప్రైవేట్ అంబులెన్స స్టాండ్‌లోని డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముర్తుజా అన్నారు.
అనంతపురం టౌన, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు భగతసింగ్ ప్రైవేట్ అంబులెన్స స్టాండ్‌లోని డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముర్తుజా అన్నారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రి ఎదుట ప్రైవేట్ అంబులెన్స డ్రైవర్లు ప్రజానుకూలంగా ఒక పద్దతి ప్రకారం సీరియల్‌గా బాడుగలకు వెళ్తూ, తాము వెళ్లే బాడుగల రూట్ల రేట్లు పట్టికల ద్వారా ప్రకటించి, తక్కువ బాడుగలకు సేవలందిస్తున్నారన్నారు. నిజాయతీగా అంబులెన్స సేవలందిస్తున్న డ్రైవర్లను ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఎస్సీ ఎస్టీ జేఏసీ సాకే హరి, బీఎ్‌సపీ ఓబులేసు, పసులూరి ఓబలేసు, జీవరత్నం, రాజా, వలి, గోపాల్, ఎన్టీఆర్ శ్రీనివాసులు, రాజేష్, నాగేంద్ర, మహేష్, నరేష్, అమర్నాథ్, అక్బర్, జిలాన, ఆశారాజు, అశోక్, గోపాల్ పాల్గొన్నారు.