ALLMEVA: పంచాయతీ సెక్రటరీపై దాడి అమానుషం
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:02 AM
సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కోటకమ్మవారిపల్లి పంచాయతీ కార్యదర్శి ఫారూఖ్‌పై దాడి అమానుష చర్య అని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన(ఆల్‌మేవా) నాయకులు ఖండించారు.
అనంతపురం టౌన, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కోటకమ్మవారిపల్లి పంచాయతీ కార్యదర్శి ఫారూఖ్‌పై దాడి అమానుష చర్య అని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన(ఆల్‌మేవా) నాయకులు ఖండించారు. దాడిలో గాయపడి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫారూఖ్‌ను బుధవారం నాయకులు షేక్షావలి, ఫారూక్ మహమ్మద్ పరామర్శించారు. వారు మాట్లాడుతూ విధినిర్వహణలో భాగంగా కోటకమ్మవారిపల్లి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగులుగా సరైంది కాదన్నారు. దాడి చేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. దౌలా, మహ్మద్ రఫి, సర్దార్, జిలాన, రసూల్ పాల్గొన్నారు.