CPI: విద్యుత భారాలపై మరో ఉద్యమం
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:00 AM
విద్యుతరంగంలో ప్రభుత్వాల నిర్ణయాలకు విరుద్ధంగా ఉమ్మడిరాష్ట్రంలో చేపట్టిన ఉద్యమంలో అమరులైన వీరుల స్ఫూర్తితో మరో ఉద్యమం చేపట్టడానికి సిద్దమవుతున్నట్లు వామపక్షనేతలు అన్నారు.
అనంతపురం విద్య ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): విద్యుతరంగంలో ప్రభుత్వాల నిర్ణయాలకు విరుద్ధంగా ఉమ్మడిరాష్ట్రంలో చేపట్టిన ఉద్యమంలో అమరులైన వీరుల స్ఫూర్తితో మరో ఉద్యమం చేపట్టడానికి సిద్దమవుతున్నట్లు వామపక్షనేతలు అన్నారు. విద్యుత ఉద్యమంలో హైదరాబాద్‌లో జరిగిన కాల్పులలో మరణించిన అమరులకు గురువారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం విద్యుత రంగంలో ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ చేపట్టిన వామపక్షాల ఉద్యమంలో అప్పటిసర్కారు కాల్పులు జరపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్నారు. అసువులుబాసిన వారి ఆత్మకు శాంతికలగాలనే ఈరోజు నిరసన,నివాళులు అర్పించి భవిష్యతఉద్యమంపై ప్రతిజ్ఞ చేశామన్నారు. సీపీఐ, సీపీఎం వామపక్షాల నేతలు నాగరాజు, చంద్రశేఖర్, మల్లికార్జున, రాజారెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణ, కుళ్లాయిస్వామి, రాజేష్, కృష్ణుడు పాల్గొన్నారు.
నార్పల, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కూరగాయలపల్లి గ్రామంలో గురువారం పెంచిన విద్యుత చార్జీలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మండల కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న మోదీ, అదానీ అనుకూల విద్యుత సంస్కరణలు, పెంచిన విద్యుత చార్జీలు, ట్రూఅప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు తదితర విధానాలపై పోరాడుతామన్నారు. అనంతరం నాయకులు ప్రతిజ్ఞ చేశారు. మండల సహాయ కార్యదర్శి చేపల రామాంజి, వ్యవసాయ కార్మిక మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య, నారాయణప్ప, శీనా, నారాయణ, గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు.