Share News

MLA DAGUPATI: పీఎం సూర్యఘర్‌తో ఎంతో ప్రయోజనం

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:13 AM

ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన పథకంతో పేదలకు మరింత విద్యుత ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. మంగళవారం స్థానిక అనంత నగరపాలక సంస్థ న్యూ కాన్ఫరెన్సహాల్‌లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్‌ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

MLA DAGUPATI: పీఎం సూర్యఘర్‌తో ఎంతో ప్రయోజనం
MLA Daggubati Prasad speaking

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన పథకంతో పేదలకు మరింత విద్యుత ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. మంగళవారం స్థానిక అనంత నగరపాలక సంస్థ న్యూ కాన్ఫరెన్సహాల్‌లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్‌ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎం సూర్యఘర్‌ పథకం తీసుకువచ్చారని తెలిపారు. సబ్సిడీతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే ఉచిత విద్యుత అందుతుందని తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి పీఎం సూర్యఘర్‌ యోజన పథకం ప్రాధాన్యం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు పోతుల లక్ష్మీనరసింహ, కొండన్న, మెప్మా సిబ్బంది, సీఓలు, ఆర్‌పీలు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హరిత అనంతే లక్ష్యం

అనంతపురం క్రైం: హరిత అనంతే లక్ష్యంగా ముందుకు సాగుదామని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో మొక్కల నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాలాస్వామి, ఇతర అధికారులు, నాయకులతో కలసి ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ..నగరాన్ని హరిత అనంతగా మార్చడమే తన లక్ష్యమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం సుబ్రమణ్యం, కోనంకి గంగారామ్‌, డీఈ నరసింహులు, పరమేశ్వర్‌, బల్లా పల్లవి, సరళ, గోళ్ల సుధాకర్‌నాయుడు, నెట్టెం బాలకృష్ణ, నాగభూషణం, ముస్తాక్‌, జయరాంనాయక్‌ పాల్గొన్నారు

Updated Date - Sep 03 , 2025 | 12:13 AM