Home » Anantapur urban
సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో పర్యవేక్షణ కొరవడిందని గుంతకల్లు డివిజన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్ కమిటీ సభ్యులు హరిప్రసాద్, సాకే గో విందు అన్నారు.
మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని శనివారం టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులతో కలిసి ప్రారంభించారు.
పట్టణంలోని ఆర్ జితేంద్రగౌడ్ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రైతుల అవసరాలకు అ నుగుణంగా యూరియా అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతుకు రెండే బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నా, వారికి సరపడా ఎరువులను అందించడంలో జిల్లా అధికార యం త్రంగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఆ కార్యాలయం వద్దకే వెళ్లాలి. నెల జీతాల నుంచి పెద్ద బిల్లుల వరకు అక్కడి వారే పరిష్కారం చూపాలి. కలెక్టరేట్ కిందే ఉన్నా వారిని పర్యవేక్షించే వారే కరువయ్యారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభమవనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఆస్తులను డిజిటలైజేషనలో భాగంగా అనంత నగరపాలక సంస్థ పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైందని, ఆస్తుల రీసర్వేపై ప్రత్యేకదృష్టి సారించి సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.
అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల కళల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరిలో రైతులతో కలిసి గురువారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో చిరు జల్లులు కురిసినా ఉత్సాహంగా వేలాది మంది రైతులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
రైతుల ప్రాణాలు పోయినా.. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులకు పట్టడం లేదని జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత కార్యాలయంలోని సమావేశ భవనంలో జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.