MLA SUNITHA: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:10 AM
బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్ స్కూల్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్ స్కూల్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీరు కూడా ఎందులోనూ తక్కువ కాదని ఎవరో ఏదో అనుకుంటారని అపోహ చెందకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఒకప్పుడు తాను వంటింటికే పరిమితమయ్యాయని, అనుకోని పరిస్థితుల్లో భర్త మరణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. బాలికలుచిన్న వయస్సు కావడంతో కొందరు మాటలువిని పక్కదారి పట్టే అవకాశం లేకపోలేదని, జా గ్రత్త వహిస్తూ చదువుకోవాలన్నారు. అనంతరం కేజీబీవీలో రూ.2.25కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్ అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ఆమె పరిశీలించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని, త్వరగా పూర్తీ చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎస్‌ఓ మురళీ, సీడీపీఓ కవితాదేవి, ప్రిన్సిపాళ్లు స్వర్ణలత, సువర్ణ, తహసీల్దార్ సురేశకుమార్, ఎంపీడీఓ బాలకృష్ణుడు, ఎంఈఓ ప్రసూనకుమార్‌నాయుడు, ఈఓఆర్‌డీ అశోక్‌నాయక్, టీడీపీ కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే
కనగానపల్లి(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండపల్లి గ్రామంలో కోదండరామ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. శుక్రవారం విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి, మహిళలు బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని ధ్వజస్తంభానికి పూజలు చేశారు. ఆమె వెంట డీసీఎంఎస్, మార్కట్‌యార్డ్ చైర్మనలు నెట్టెం వెంకటేష్, సుధాకర్‌చౌదరి, కన్వీనర్ యాతం పోతలయ్య ఉన్నారు.