Share News

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:12 AM

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వీరిద్దరూ అక్కచెల్లెల్లు. పేర్లు.. సత్యమ్మ, భ్రమరాంబ. సమస్య ఏమిటని అధికారులు అడిగితే.. ‘మేము అనంతపురంలో ఉంటున్నాం.

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

గ్రీవెన్సలో సోదరులపై అక్కాచెల్లెళ్ల ఫిర్యాదు

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వీరిద్దరూ అక్కచెల్లెల్లు. పేర్లు.. సత్యమ్మ, భ్రమరాంబ. సమస్య ఏమిటని అధికారులు అడిగితే.. ‘మేము అనంతపురంలో ఉంటున్నాం. మా అమ్మపేరు వెంకటమ్మ. తనకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలం. కొడుకులు చూసుకోవడం లేదని మా అమ్మ మా వద్దే ఉంటున్నారు. రాప్తాడు మండలం పాలచెర్లలో మా అమ్మకు పొలం ఉంది. ఆ భూముల కౌలు డబ్బులు, ప్రభుత్వ పథకాలు డబ్బులను మా సోదరులే తీసుకుంటున్నారు. అయినా మేము పట్టించుకోలేదు. మా అమ్మ వృద్ధాప్యంలో, కదలలేని స్థితిలో ఉన్నారు. అయినా వారికి దయ లేదు. ఇటీవల కౌలు రైతు మాకు ఒక మూట చెనిక్కాయలు ఇచ్చారు. ఆ విషయం తెలిసి మా సోదరులు రగిలిపోతున్నారు. మాకు ఆ మాత్రం కూడా ఇవ్వకూడదట. అందుకే మా అమ్మ భూమిలో మాకూ వాటా కావాలి. దయచేసి న్యాయం చేయండి..’ అని విన్నవించారు.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం కలెక్టరేట్‌

Updated Date - Sep 23 , 2025 | 12:12 AM