MLA SINDHURA : గ్రంథాలయాలను ఆధునికీకరించండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:05 AM
గ్రంథాలయ సమస్యలను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం ప్రస్తావించారు. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయ సమస్యలను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం ప్రస్తావించారు. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. జ్ఞాన సముపార్జనకు గ్రంఽథాలయాలు అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో పనిచేసే సిబ్బంది జీతాలకు తగినంత గ్రాంటు ఇవ్వడం లేదని అన్నారు. స్థానిక సంస్థల నుంచి వచ్చే పన్ను ఆదాయాన్ని గ్రంథాలయాల నిర్వహణకు కేటాయించాల్సి వస్తోందని, దీనివల్ల గ్రంఽథాలయాల అభివృద్ధి ఆగిపోతోందని అన్నారు. ఖాళీగా ఉన్న లైబ్రేరియన, వాచమన, రికార్డు అసిస్టెంటు పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంఽథాలయాలను ఆధునికీకరించాలని ఎమ్మెల్యే కోరారు. యువతకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాల ధరలు మార్కెట్‌లో అధికంగా ఉన్నాయని, వీటి ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తే బాగుంటుందని అన్నారు. ఈ సమస్యలపై మంత్రి నారా లోకేశ బదులిచ్చారు. ఎమ్మెల్యే తెలియజేసిన సమస్యలపై అధికారులతో చర్చించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.