TDP: తాడేపల్లి డైరెక్షనలోనే అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:16 AM
తాడేపల్లి ప్యాలె్‌సలోని వైసీపీ నేతల డైరెక్షనలో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి సర్పంచ నిప్పుపెట్టాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
అనంతపురం క్రైం, అక్ట్టోబరు9(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి ప్యాలె్‌సలోని వైసీపీ నేతల డైరెక్షనలో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి సర్పంచ నిప్పుపెట్టాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గురువారం రాత్రి నగరంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేసి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ... వైఎస్ జగనకు, వైసీపీ నాయకులకు మొదటి నుంచీ దళితులను అవమానించడం, మోసగించడం అలవాటుగా మారిందన్నారు. దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం ఇందుకు నిదర్శనం అన్నారు. సర్పంచ గోవిందయ్యతోపాటు మరికొందరు ఈ ఘటనలో పాల్గొన్నట్టు సాక్ష్యాలతో రుజువైందన్నారు. ప్రశాంత వాతావరణంలో అశాంతి రేకెత్తించే విధంగా జగన కుట్రలకు తెరలేపుతున్నాడన్నారు. వైసీపీని, జగనను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్‌చేశారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, ఎస్సీ కార్పొరేషన డైరెక్టర్ కమలమ్మ పాల్గొన్నారు.