DOCTOR: నేత్రాలకు విశ్రాంతి ఇవ్వాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:19 AM
మానవదేహంలో ప్రధానమైన నేత్రాలకు విశ్రాంతినివ్వాలి. నిరంతరాయంగా మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం. వెలుతురులేని ప్రదేశాల్లో అధికసమయం ఉండటం వంటి అంశాలు నేత్రాలకు నిరంతర శ్రమలాంటిది.
అనంతపురం వైద్యం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): మానవదేహంలో ప్రధానమైన నేత్రాలకు విశ్రాంతినివ్వాలి. నిరంతరాయంగా మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం. వెలుతురులేని ప్రదేశాల్లో అధికసమయం ఉండటం వంటి అంశాలు నేత్రాలకు నిరంతర శ్రమలాంటిది. వీటికి దూరంగా ఉండేలా ప్రయత్నించాలని జిల్లా అంధత్వ నివారణ అధికారి, కంటి వైద్యనిపుణుడు డాక్టర్ సైదన్న తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘మీకళ్లను ప్రేమించండి’ అనే నినాదంతో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సైదన్నతో పాటు కంటి విభాగాధిపతి డాక్టర్ కస్తూరి, డాక్టర్ మంజుల, ఇనచార్జ్ ఏడీ డాక్టర్ సౌజన్య కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సిబ్బందిని ఘనంగా సన్మానించారు.