DMHO :అవకాశాల్లో బాలికలకు సమానత్వం
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:14 AM
సమాజంలోని అన్ని అవకాశాల్లో బాలికలకు సమానత్వముందని, వారిని ప్రోత్సహించడం కుటుంబ సభ్యులు మరవకూడదని డీఎంహెచఓ ఈబీ దేవి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్ర నగరపాలకోత్న పాఠశాలలో వేడుకలు నిర్వహించారు.
అనంతపురం వైద్యం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సమాజంలోని అన్ని అవకాశాల్లో బాలికలకు సమానత్వముందని, వారిని ప్రోత్సహించడం కుటుంబ సభ్యులు మరవకూడదని డీఎంహెచఓ ఈబీ దేవి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్ర నగరపాలకోత్న పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన బాలిక కుటుంబానికి బలమని, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యమని అన్నారు. డెమో నాగరాజు, డిప్యూటీ డెమో త్యాగరాజు, హెచఈఓ గంగాధర్, ఐసీడీఎస్ పీడీ ఉమాశంకరమ్మ, ఎంఈఓ వెంకటస్వామి, ప్రధానోపాధ్యాయులు రేణుక, హెచఈ వెంకటేష్, వేణు, కిరణ్, లీగల్ కన్సల్టెంట్ ఆశారాణి పాల్గొన్నారు.
రామగిరి(ఆంధ్రజ్యోతి): ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా పెంచి మంచి భవిష్యత్తు నిద్దామని తహసీల్దార్ రవికుమార్ అన్నారు. శుక్రవారం కేజీబీవీ పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎంఈఓ సూర్యప్రకాశ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లతాకిరణ్, ఎస్‌ఓ సౌమ్యలత పాల్గొన్నారు.
కనగానపల్లి, (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు చదివినప్పుడే బాలికలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రశాంతి అన్నారు. స్థానిక జడ్పీ పాఠశాలలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంఈఓ శ్రీదేవి, సూపర్‌వైజర్ శ్రీనివాసులు, అంగనవాడీ సిబ్బంది పాల్గొన్నారు.
శింగనమల(ఆంధ్రజ్యోతి): బాలికల హక్కులను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని సీడీపీఓ చల్లా లలితమ్మ అన్నారు. శుక్రవారం స్థానిక కేజీబీవీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ సమితి ప్రొటెక్షన ఆఫీసర్ చంద్రకళ విద్యార్థినులకు అవగహన కల్పించారు. సూపర్‌వైజర్లు కల్పన, కౌసల్య, నేతాజీ పాల్గొన్నారు.