MLA SUNITHA: తగ్గించిన జీఎస్టీ ప్రకారమే కొనుగోలు చేయండి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:15 AM
ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
రామగిరి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న వ్యాపారులు, రైతులు, అధికారులు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతి దుకాణం వద్దకు వెళ్లి కరపత్రాలను అందించి జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించారు. అంతకు ముందుకు మాదాపురం గ్రామంలో పర్యటించి విశ్రాంత బీఎ్‌సఎనఎల్ అధికారి నాగభూషణ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని, బోయ బ్రహ్మయ్య గత నెలలో మృతిచెందిన ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రతి ఇంటిపై సోలార్ కనిపించాలి: అవకాశం ఉన్నప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ కనిపించేలా పీఎంసూర్యఘర్‌పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేపరిటాలసునీత అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రా మంలో గురువారం బడ్డింగ్ లీఫ్ ఇనఫ్రాటెక్ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా ఈ పథకం అమలయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ముందుగా ఈ పథకంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. గృహ వినియోగదారులే కాకుండా పాఠశాలలు, ఎవరైనా కంపెనీలు ఉన్నవారు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.