Home » Amit Shah
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంగళవారం పార్లమెంట్ ద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.
పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు ఈ సమావేశాలు సజావుగా సాగనందున.. త్వరలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
విదేశాలకు పారిపోయిన నేరస్థులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2019 నుంచి 2026 మధ్య కాలంలో 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను అమిత్ షా ప్రశంసించారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. ఈ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను మంగళవారంనాడిక్కడ కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు.
అక్రమ వలసలు, ఇతర కారణాలతో దేశంలో చోటుచేసుకుంటున్న 'అసహజ జనాభా మార్పు'పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు.