Amit Shah On Vote Chori: మూడు సార్లు ఓట్ చోరీ .. నెహ్రూ, ఇందిర, సోనియాగాంధీని టార్గెట్ చేసిన అమిత్‌షా
ABN , Publish Date - Dec 10 , 2025 | 09:30 PM
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకున్నప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్‌షా చెప్పారు.
న్యూఢిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ గందరగోళం సృష్టించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తప్పుపట్టారు. ఎస్ఐఆర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ, విపక్షాలు గత నాలుగు నెలలుగా 'ఓట్ చోరీ'పై మాట్లాడుతున్నాయని, అయితే దేశంలో నిజంగా ఎప్పుడు, ఎలా ఓట్ చోరీ జరిగిందో తాను చెప్పాలనుకుంటున్నానని అన్నారు.
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేనప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్‌షా చెప్పారు.
కాంగ్రెస్ హయాంలోనే మూడుసార్లు ఓట్ చోరీ
స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ హయాంలోనే మూడు సార్లు 'ఓట్ చోరీ' ఘటనలు చోటుచేసుకున్నాయని అమిత్‌షా విమర్శించారు. జవహర్ లాల్ ప్రధానిగా ఉన్నప్పుడు 1952లో తొలిసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరిగిందని చెప్పారు. దేశ తొలి ప్రధానిని నిర్ణయించే సమయంలో మొదటిసారి ఓట్‌చోరీ జరిగిందని, మెజారిటీ పీసీసీలు సర్దార్ పటేల్‌ను ఎన్నుకున్నాయని, మొత్తం ఓట్లలో 28 ఓట్లు పటేల్‌కు పడితే, నెహ్రూకు కేవలం రెండో ఓట్లు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ నెహ్రూ ప్రధాని అయ్యారని అన్నారు. రెండో ఘటన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని చెప్పారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పినప్పటికీ ఆమె తనకు తాను లీగల్ ఇమ్యూనిటీ కల్పించుకున్నారని అన్నారు. మూడో ఘటనలో భారతీయ పౌరురాలు కాకముందే సోనియాగాంధీ ఓటరయ్యారని, ఇప్పుడు ఆ అంశం న్యాయస్థానంలో ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఇది ఓట్ చోరీకి మరో ఉదాహరణ అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల్లో ఓటమిపాలవ్వడంతో ఇక తప్పుడు మార్గాల్లో గెలవలేమని ఆందోళన చెందుతోందని అమిత్‌షా విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ నాయకత్వమే కారణమని, ఈవీఎంలు, ఓట్ చోరీ కాదని అన్నారు. అక్రమ చొరబాటుదారులను ఓటరు జాబితాలో ఉంచేందుకు విపక్షాలు ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
88 నిమిషాలు చర్చ... సెంట్రల్ ప్యానల్ నియామకాలపై మోదీతో విభేదించిన రాహుల్
శశిథరూర్‌కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి