Shashi Tharoor: శశిథరూర్‌కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం లేదన్న ఎంపీ
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:16 PM
హై రేంజ్ రూరల్ డవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌ఆర్‌డీఎస్) అనే సంస్థ 'ది వీర్ సర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డ్ -2025'ను నెలకొల్పింది. తొలి అవార్డు గ్రహీతగా శశిథరూర్ పేరును ప్రకటించింది.
న్యూఢిల్లీ: బీజేపీకి దగ్గరవుతున్నారంటూ సొంత పార్టీ నేతల నుంచే ఇటీవల వరుస విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)ను వీరసావర్కర్ (Veer Savarkar) పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుకు నామినేట్ చేశారు. అయితే ఈ అవార్డను అందుకునేందుకు శశిథరూర్ నిరాకరించారు. అవార్డు ఏర్పాటు ఉద్దేశం, అవార్డు ఇస్తున్న ఆర్గనేజేషన్ గురించి సరైన క్లారిఫికేషన్ లేనందున ఈ గౌరవాన్ని తోసిపుచ్చుతున్నట్టు చెప్పారు. 'నేను వెళ్లడం లేదు' అని ఆన్‌లైన్ పోస్టులో ఆయన తెలిపారు.
హై రేంజ్ రూరల్ డవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌ఆర్‌డీఎస్) అనే సంస్థ 'ది వీర్ సర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డ్ -2025'ను నెలకొల్పింది. తొలి అవార్డు గ్రహీతగా శశిథరూర్ పేరును ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ హాలులో ఈ అవార్డును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడు ప్రారంభించనున్నారు. జాతీయ అభివృద్ధి, సామాజిక సంస్కరణలు, మనవతా సేవకు పాటుపడిన వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డుతో గౌరవించనున్నారు.
మీడియా వార్తలతోనే తెలిసింది..
ఈ అవార్డు గురించి శశిథరూర్‌ను మీడియా ప్రశ్నించగా, తాను మంగళవారంనాడు కేరళలో ఉన్నప్పుడు మీడియా వార్తల ద్వారానే ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఈ అవార్డు గురించి తనకు తెలియదని, అవార్డును కూడా తీసుకోవడం లేదని చెప్పారు. నిర్వాహకులు తన పేరును ప్రకటించినప్పుడు ముందుగా తనను సంప్రదించక పోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అవార్డు తీసుకునేందుకు అంగీకరించేదీ లేనిదీ తెలుసుకోకుండా నిర్వహకులు తన పేరు ప్రకటించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఢిల్లీలోని పలు మీడియా సంస్థలు ఈరోజు కూడా తనను ఇదే ప్రశ్న వేశాయని, వీరసావర్కర్ పేరుతో ఏర్పాటు చేసే అవార్డును తీసుకోరాదని తమ పార్టీ సహచరులు కూడా గట్టిగా నమ్ముతుంటారని చెప్పారు.
శశిథూరూర్ స్వరాష్ట్రమైన కేరళకు చెందిన కాంగ్రెస్ వెటరన్ కె.మురళీధరన్ మాట్లాడుతూ, వీరసావర్కర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును తీసుకోవడం అంటే కాంగ్రెస్‌ను అవమానించడం, ఆందోళనకు గురిచేయడమేనని అన్నారు. కాగా, వీరసావర్కర్‌ను రివల్యూషనరీ నేతగా బీజేపీ చెబుతుంటుంది. అయితే స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర ఏమీలేదని కాంగ్రెస్ తెగేసి చెబుతుంటుంది.
ఇవి కూడా చదవండి..
జర్మనీ పర్యటనకు రాహుల్.. లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్
సీఐసీ నియామకానికి సమావేశమవుతున్న మోదీ, అమిత్‌షా, రాహుల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి