PM Modi Dinner NDA MPs: ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మోదీ విందు.. సభావ్యూహంపై కసరత్తు
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:35 PM
ఎన్డీయే విస్తృత ఎజెండా, ప్రస్తుత సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండాపై ప్రధాని ఈ సమావేశంలో ఎంపీలతో ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అంశం కూడా విందు సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలకు తన నివాసంలో ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఉభయసభల్లో పరస్పర సహకారం, భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఎన్డీయే విస్తృత ఎజెండా, ప్రస్తుత సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండాపై ప్రధాని ఈ సమావేశంలో ఎంపీలతో ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అంశం కూడా విందు సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది. సీనియర్ మంత్రులు, ఫ్లోర్ లీడర్లు, భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఈ విందులో పాల్గొంటారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల కోసం అనుసరించాల్సి వ్యూహంపై కూడా ఎన్డీయే భాగస్వాములతో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే పార్టీ సంస్థాగత కార్యక్రమాలను బీజేపీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 20న పశ్చిమబెంగాల్‌లో ప్రధాని పర్యటిస్తారని, నడియా జిల్లాలో పబ్లిక్ ప్రోగ్రాంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ బెంగాల్ నాయకత్వంతో వ్యూహాత్మక సమావేశాలను కూడా మోదీ నిర్వహించనున్నారు. సంస్థాగత సన్నద్ధతను సమీక్షించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పశ్చిమబెంగాల్‌లో నాలుగు నుంచి ఆరు పరివర్తన్ యాత్రలు నిర్వహించేందుకు కూడా బీజేపీ సన్నాహాలు చేస్తోంది. మోదీ స్వయంగా ఒక యాత్రలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి..
88 నిమిషాలు చర్చ... సెంట్రల్ ప్యానల్ నియామకాలపై మోదీతో విభేదించిన రాహుల్
శశిథరూర్‌కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి