Share News

Pm Narendra Modi: అంకితభావంతో పనిచేసే నాయకుడు.. నితిన్ నబిన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

ABN , Publish Date - Dec 14 , 2025 | 08:15 PM

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పలువురు అగ్ర నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Pm Narendra Modi: అంకితభావంతో పనిచేసే నాయకుడు.. నితిన్ నబిన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
Nitin Nabeen Appointed BJP Working President

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితిన్ నబిన్ కి పలువురు అగ్ర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత అధ్యక్షులు జేపీ నడ్డా స్థానంలో నబిన్ బాధ్యత స్వీకరించారు. నితిన్ నబిన్ గొప్ప సంస్థాగత అనుభవం ఉన్న నాయకుడు, ఎమ్మెల్యే, బీహార్ మంత్రిగా ఆయన పనితీరు అద్భుతం. కష్టపడి పనిచేసే నాయకుడిగా నబిన్ గుర్తింపు పొందారు. ఆయన పనితీరు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని నమ్ముతున్నా అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.


బీజేపీ యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ రాష్ట్ర యువ విభాగం ప్రెసిడెంట్‌గా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్ చార్జిగా నితిన్ నబిన్ అంకిత భావంతో బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడే ప్రతి యువ కార్యకర్తకు దక్కిన గౌరవం ఇది అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

బిహార్ నేలపై నుంచి వచ్చిన యువ నాయకుడు పార్టీకి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నితిన్ నబిన్ శక్తివంతమైన గొప్ప నాయకుడు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని విశ్వసిస్తున్నా అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.

యువకుడిగా, చురుకైన నాయకుడిగా, పార్టీ సిద్దాంతాలపై గట్టి విశ్వాసంతో అందరిచే గుర్తింపు పొందిన నేతగా నితిన్ నబిన్ జీకి గొప్ప గుర్తింపు ఉంది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ ఏపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ట్విట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా

Updated Date - Dec 14 , 2025 | 08:15 PM