Home » Ambati Rambabu
18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు.
సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు.
సంక్రాంతి పండగ వేళ లక్కీ డ్రా కేసులో బలవంతంగా టికెట్లు విక్రయించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వివాదంలో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జనసేన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పీటీ వారెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూలు చేసినట్లు అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు ఆయనపై ఈ వారెంట్ వేశారు.
ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. గుంటూరు ఎక్సైజ్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో బారికేడ్లు తోసుకుని వెళ్లిన ఘటనపై గతంలోనే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.