నేను ఇంత పెద్ద వయస్సులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అంబటి రాంబాబు
ABN , Publish Date - Jan 31 , 2026 | 06:17 PM
ఇంత పెద్ద వయస్సులో తాను అలా మాట్లాడటం తప్పేనని, టీడీపీ కార్యకర్తల్ని తిట్టి ఉండాల్సింది కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇంత పెద్ద వయస్సులో తాను అలా మాట్లాడటం తప్పేనని, టీడీపీ కార్యకర్తల్ని తిట్టి ఉండాల్సింది కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తనపై వ్యక్తమవుతున్న విమర్శలపై తాజాగా అంబటి స్పందించారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంబటి వ్యాఖ్యానించారు (Ambati Rambabu).
'నేను చంద్రబాబును బూతులు తిట్టలేదు. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ విమర్శ చేస్తాను. కార్యకర్తలను మాత్రం తిట్టకుండా ఉండాల్సింది. నన్ను చంపే ప్రయత్నం చేశారు. కర్రలు పట్టుకొని తిరిగిన వాళ్లను, నన్ను తిట్టే వాళ్ళని పోలీసులు ఆపగలిగారా. అరెస్టు చేస్తామని బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు. అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నన్ను తిట్టారు. నేను వాళ్లను తిట్టాను' అని అంబటి పేర్కొన్నారు (political apology statement).
'బూతులు మాట్లాడానన్న మనో వేదన నాలో ఉంది. అరెస్టుకు భయపడి నేను ఇలా మాట్లాడటం లేదు. ముందస్తు బెయిల్ కూడా తీసుకోను. చంద్రబాబు సంగతి తేలుస్తాను. లాయర్ గా ఉన్నాను. నాకు చట్టం తెలుసు నాకు. చంద్రబాబు, లోకేష్ అరెస్టు చేయమన్నారు.. పోలీసులు చేస్తున్నారు' అని అంబటి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్
కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి